గూగుల్‌లో ఇంగ్లిష్‌ ఎలా నేర్చుకోవాలో తెలుసా.?

TV9 Telugu

04 November 2024

ఇంగ్లిష్‌లో మాట్లాడాలి అనుకునే వారి కోసం గూగుల్‌ కొత్త టూల్‌ను తీసుకొచ్చింది. ‘స్పీకింగ్‌ ప్రాక్టీస్‌’ ఫీచర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా పని చేస్తుంది.

గూగుల్‌ సెర్చ్‌ల్యాబ్స్‌ ప్రోగ్రామ్‌ను ప్రయోగాత్మకంగా భారత్‌ సహా అర్జెంటీనా, కొలంబియా, ఇండోనేషియా, మెక్సికో, వెనుజులాలో లాంచ్‌ చేసింది.

ఈ స్పీకింగ్‌ ప్రాక్టీస్‌లో పాల్గొనాలంటే గూగుల్‌ సెర్చ్‌ల్యాబ్‌ ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్‌ చేసుకోవాలి. ఇందుకోసం మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోని గూగుల్‌ యాప్‌ ఓపెన్ చేయాలి.

అందులో ల్యాబ్‌ సింబల్‌పై క్లిక్‌ చేయాలి. అక్కడ కనిపించే ‘ఏఐ ఎక్స్‌పరమెంట్‌’ విభాగంలో ‘స్పీకింగ్‌ ప్రాక్టీస్‌’ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్‌ చేసుకోవాలి.

మీ ప్రాక్టీస్‌ను మొదలుపెట్టొచ్చు. మీ ఆండ్రాయిడ్‌ డివైజ్‌లో ఇంగ్లిష్‌ నుంచి లేదా ఇంగ్లిష్‌లోకి ఏదైనా తర్జుమా చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ ఫీచర్‌ దర్శనమిస్తుంది.

ఈ స్పీకింగ్‌ ప్రాక్టీస్‌లో నేరుగా మాట్లాడొచ్చు లేదంటే టైప్‌ చేయొచ్చు. దానికి ఏఐ సమాధానం ఇస్తుంది. ఎలా మాట్లాడాలో కూడా కొన్ని సూచనల రూపంలో తెలియజేస్తుంది.

దానికి ఫాలో అప్‌ ప్రశ్నలు కూడా ఉంటాయి. మనం ఇచ్చే ఇన్‌పుట్‌ను బట్టి ‘స్పీకింగ్‌ ప్రాక్టీస్‌’ నుంచి సమాధానాలు వస్తాయి.