ఎన్ని అంతరిక్ష కేంద్రాలు ఉన్నాయో తెలుసా..?

TV9 Telugu

11 February  2024

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు అంతరిక్షంలో పరిశోధన కోసం మొత్తం 11 దేశాల స్పేస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.

వివిధ దేశాల 11 స్పేస్ స్టేషన్స్ ఉన్నప్పటికీ ప్రస్తుతం రెండు మాత్రమే అంతరిక్షంలో విజయవంతంగా పనిచేస్తున్నాయి.

రెండు అంతరిక్ష కేంద్రాలకు ISS , టియాంగాంగ్ పేర్లు పెట్టారు. భారత దేశానికి ఇప్పటి వరకు సొంతంగా ఎలాంటి అంతరిక్ష కేంద్రం లేదు.

భారత్ మిత్రదేశం రష్యా తొలిసారిగా 1971 సంవత్సరంలో అంతరిక్షంలో తన అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

1973 సంవత్సరంలో అగ్రరాజ్యమైన అమెరికా దేశం స్కైలాబ్ పేరుతో తొలిసారి తన అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

ప్రపంచంలోనే అతిపెద్ద అంతరిక్ష కేంద్రం ISS 1998లో అంతరిక్షంలో ప్రారంభించడం జరిగిందని చరిత్ర చెబుతుంది.

అంతరిక్షంలో ISS నిర్మాణానికి 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు అయిందని చరిత్రకారులు చెబుతున్నారు.

అంతరిక్షంలో నాసా నిర్మించిన అంతరిక్ష కేంద్రం చైనా నిర్మించిన అంతరిక్ష కేంద్రం టియాంగాంగ్ కంటే చాలా పెద్దది.