యాపిల్ లవర్స్‌ను ఎంతాగానే ఆకట్టుకుంటున్న ఐఫోన్ 15 సిరీస్ సరికొత్త టెక్నాలజీతో మార్కెట్‌లోకి వచ్చింది.
కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఐఫోన్ 15 సిరీస్‌తో భారత అంతరక్ష సంస్థ కనెక్షన్ ఉందంటే మీరు నమ్ముతారా.
కొత్తగా మార్కెట్లో రిలీజ్ అయ్యిన ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌లో ఇస్రో రూపొందించిన కొత్త టెక్నాలజీ జత కలిసింది.
జీపీఎస్ సిస్టమ్ న్యావిగేషన్ విత్ ఇండియన్ కన్‌స్టెలేషన్‌కు సపోర్ట్‌తో కొత్త ఐఫోన్ 15 సిరీస్ అందుబాటులోకి వచ్చింది.
లేటెస్ట్ టెక్నాలజీ యాపిల్ తన ఐఫోన్ మోడల్స్‌లో తీసుకురావడం ఇదే మొదటిసారి. ఇస్రో రూపొందించిన కొత్త టెక్నాలజీ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ రెండింటిలోనూ ఉంటుంది.
న్యావిగేషన్ విత్ ఇండియన్ కన్‌స్టెలేషన్‌ని గతంలో ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌గా పిలిచేవారు.
కొత్త టెక్నాలజీ భారతదేశపు మొత్తం భూభాగాన్ని కవర్ చేస్తుంది. జీపీఎస్ కంటే కూడా మంచి ఫలితాలను ఇస్తుందని సమాచారం.
NavIC ఐఫోన్స్‌తో పాటు రియల్‌మీ 9 ప్రో, వన్ ప్లస్ నార్డ్ 2టీ, షియోమీ ఎమ్ఐ 11ఎక్స్ వంటి వాటిలో కూడా లభిస్తుంది.
యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో పొందుపర్చిన నావిక్ శాటిలైట్ సిస్టమ్‌ను ISRO స్వతంత్రంగా అభివృద్ధి చేసింది.