ఇకపై Googleలో సెర్చ్ కోసం డబ్బులు చెల్లించాలా..?

TV9 Telugu

05 November 2024

గూగుల్ కంపెనీ తన సెర్చ్ సర్వీస్‌ను ఇప్పటి వరకు ఉచితంగానే ఉంచింది. అయితే ఇక నుంచి మీరు Googleలో సెర్చ్ చేయడానికి చెల్లించాలా?

త్వరలోనే గూగుల్ కంపెనీ తన విధానాన్ని మార్చుకోవచ్చని తెలుస్తోంది. త్వరలో కొత్త రూల్స్ రానున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రీమియం ఫీచర్‌ల కోసం ఛార్జీ విధించడానికి ప్రపంచ దిగ్గజ సెర్చ్ ఇంజిన్ Google సంస్థ పరిశీలిస్తోంది.

ఈ ప్రీమియం ఫీచర్‌లు జనరేటివ్ AI (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) నుండి వచ్చే ఫలితాల గురించి ఉంటాయని సమాచారం.

ఇటీవల, ప్రముఖ ఆన్లైన్ సెర్చ్ గూగుల్ కంపెనీ జనరేటివ్ AI ప్రయోగాత్మక స్నాప్‌షాట్ ఫీచర్‌ను ప్రారంభించింది.

దీనికి సంబంధించిన సమాచారం ప్రపంచ ప్రముఖ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ అనేది నివేదికలో వెలుగులోకి వచ్చింది.

ఈ నివేదికలో చెప్పిన విషయం ప్రకారం, దిగ్గజ కంపెనీ గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను ఛార్జ్ చేయడం ఇదే మొదటిసారి.

దీనికి సంబంధించి గూగుల్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గూగుల్ తన శోధన సహాయంతో గతేడాది 175 బిలియన్ డాలర్లను సంపాదించింది.