డ్రగ్‌ పార్శిళ్ల పేరుతో వచ్చే ఫోన్‌ కాల్స్‌‌కు స్పందించవద్దు

TV9 Telugu

31 March 2024

డ్రగ్స్‌ పార్శిళ్లు వచ్చాయంటూ పోలీసుల మాదిరిగా ఫోన్ కాల్స్ చేసి సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు

డ్రగ్స్ పార్శిళ్లు వచ్చాయంటూ ఎవరైనా ఫోన్‌ కాల్స్‌ లేదా ఐవీఆర్‌ కాల్స్‌ చేస్తే స్పందించవద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు.

ఉన్నత విద్యావంతులు కూడా మోసపోతున్నారనీ ఈ తరహాలో మోసాలకు గురైతే సైబర్‌క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ 1930కి ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచించారు.

పలువురు బాధితులు తనను వ్యక్తిగతంగా కలిసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

ఉగ్రవాద స్లీపర్‌ సెల్స్‌తో కుటుంబానికి ప్రాణహాని ఉందని నమ్మిస్తారు. హౌజ్‌ అరెస్ట్‌ చేస్తామంటూ అన్నంత పనీ చేస్తారు అన్నారు.

పోలీసుల పేరుతో కాల్స్‌ చేస్తూ మీరు డ్రగ్‌ పెడ్లర్స్‌తో తీవ్రవాదులతో బ్యాంక్‌ లావాదేవీలు చేశారంటూ బెదిరిస్తారు.

సైబర్ నేరగాళ్లు కోట్ల రూపాయల కుచ్చుటోపీ పెడుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ హెచ్చరిక జారీ చేశారు.

ఇలాంటి ఫోన్ వస్తే మాత్రం భయపడకుండా వెంటనే మీ దగ్గర్లో ఉన్న సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయండి. లేదంటే సమస్యల్లో పడతారు.