భవిష్యత్తులో అపార్ట్‌మెంట్లు ఎలా ఉండబోతున్నాయి..!

23 November 2023

ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం విపరీతంగా పెరిపోయింది. దీనితో నెటిజనులను ఆకట్టుకుంటున్నారు.

ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు AI చిత్రాలతో అభిమానులను ఆకట్టుకొంటున్నారు. ఇపుడు మరో కొత్త ప్రయోగం చేసారు.

ప్రస్తుతం ఎక్కువగా వినియోగిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ఆర్టిస్టుల ఊహకు కొత్త ఊపునిస్తోంది.

అద్భుతమైన కృత్రిమ మేధస్సుతో, ఆర్టిస్టులు తమ హైపర్ రియలిస్టిక్ ఆర్ట్‌ వర్క్‌లతో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నారు.

నీటిలో తేలియాడే భవనాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయో అప్పుడే డిజిటల్ సృష్టికర్త AI సహాయంతో క్రియేట్ చేశారు.

మిడ్‌జర్నీ యాప్ సహాయంతో ప్రతీక్ అరోరా రూపొందించిన తేలియాడే భవనాల చిత్రాలు ప్రజలను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

మంత్రముగ్ధులను చేస్తున్న దృశ్యాలు. మూడంతస్తుల ఇల్లు నీటిలో తేలడం ప్రారంభిస్తే, అది ఎలా ఉంటుందో ఊహించండి.

గతంలో మాయానగరి ముంబైలో గాలిలో తేలియాడే భవనాలను నిర్మించి నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నాడు ప్రతీక్ అరోరా.