28 October 2023

డెంగ్యూ దోమలకు ఇలా అడ్డుకట్ట వేయొచ్చు.?

కణాల్లో చాలా వరకూ నీరే ఎక్కువగా ఉంటుంది. డీహైడ్రేషన్‌.. ఏ జీవికైనా ప్రమాదకరమే. 

ఎందుకంటే.. సరిపడా నీరు ఉంటేనే ప్రొటీన్లు, ఇతర కణ సంబంధ పరమాణువులు సక్రమంగా పనిచేస్తాయి. 

నీటి పరిమాణం తగ్గిపోతే  తట్టుకునే సామర్థ్యాన్ని కొన్ని జీవులు సాధించాయి. వీటిలో ఏడీస్‌ ఈజిప్టై దోమ కూడా ఉంది. 

ఇది జికా, డెంగీ, యెల్లో ఫీవర్‌, గున్యా వంటి వైరల్‌ వ్యాధులకు వాహకంగా ఉంది. ఉత్తర ఆఫ్రికా నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ దోమలు విస్తరించాయి.

ఏడీస్‌ దోమల గుడ్ల నుంచి లార్వాలు బయటకు రావడానికి 72 గంటల వరకూ పట్టొచ్చు.  కనీసం 15 గంటల పాటు డీహైడ్రేషన్‌ను తట్టుకోవాలి. 

డీహైడ్రేషన్‌ బారినపడని గుడ్లను పరిశీలించినప్పుడు  మొత్తంమీద వాటిలో జీవక్రియలు తగ్గాయి. 

ఈ గుడ్లలో డీహైడ్రేషన్‌ను తట్టుకునే సామర్థ్యాన్ని లక్ష్యంగా చేసుకుని చర్యలు చేపడితే దోమలు పెరగకుండా అడ్డుకోవచ్చని  శాస్త్రవేత్తలు తెలిపారు.

బెంగళూరులోని స్టెమ్‌ సెల్‌ సైన్స్‌ అండ్‌ రీజెనరేటివ్‌ మెడిసిన్‌ ఇంకా మండీలోని ఐఐటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.