ఆన్లైన్ లో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లు..

04 December 2023

ఇటీవల కాలంలో సైబర్‌ నేరగాళ్లు ‘డిజిటల్‌ అరెస్టు’ అంటూ ఆన్లైన్ లో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా, ఫోన్‌కాల్స్‌ ద్వారానే ఆన్లైన్ లో జనల డబ్బును దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.

సీబీఐ లేదా పోలీసు అధికారులమని చెబుతూ బాధితులను తీవ్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు సైబర్ మోసగాళ్లు.

కదిలితే అరెస్టు చేస్తామని చెప్పి గంటల తరబడి వారు ఉంటున్న ప్రాంతాన్నే వర్చువల్‌ జైలుగా మార్చేస్తున్నారు.

ఆ తరువాత దర్యాప్తు పేరుతో వారి బ్యాంక్‌ ఖాతాల వివరాలు తెలుసుకుని డబ్బులు స్వాహా చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.

ఇవి ‘డిజిటల్‌ అరెస్టు’ మోసాలని పోలీసులు అంటున్నారు. ఈ తరహా దోపిడీలు ఢిల్లీ, హరియాణాలో ఎక్కువగా జరుగుతున్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ తాజాగా ఇలాంటి కేసే నమోదైంది. వీడియో కాల్‌లోనే బాధితురాలిని బెదిరించి డబ్బులు దోచారు.

ఇంట్లో 8 గంటలు కదలకుండా డిజిటల్‌ అరెస్టు చేసి ఆన్లైన్ ద్వారా రూ.11.11 లక్షలు దోచేశారు సైబర్ నేరగాళ్లు.