అయోధ్య లైవ్ లింక్‌లు ఓపెన్ చేయకండి.. సైబర్ పోలీసుల అలర్ట్
TV9 Telugu
21 January 2024
లైవ్ స్ట్రీమింగ్ పేరుతో మొబైల్ కి లింక్‌లు పంపి సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారని సైబర్ పోలీసుల హెచ్చరిక.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ప్రాణప్రతిష్ఠ వేడుకలను ప్రత్యక్షంగా చూడాలని దేశవ్యాప్తంగా కులమతాల తేడా లేకుండా ప్రజలంతా ఆశపడుతున్నారు.
ఈ ట్రెండ్ ను సైబర్ నేరస్థులు తమకు అవకాశంగా మలుచుకునే అవకాశం ఉందని సైబర్ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
అయోధ్య లైవ్ పేరుతో వస్తున్న లింక్‌లు ఓపెన్ చేశారో మీ జేబు గుల్ల చేసేస్తారని ప్రజలను అప్రమత్తం చేసారు.
వాట్సాప్, మెసేజ్ ల రూపంలో లింక్ లను ఓపెన్ చేస్తే బ్యాంకుఖాతాలో సొమ్ము ఖాళీ అవ్వడం ఖాయం అన్నారు సైబర్ పోలీసులు.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చిన ప్రతి లింక్‌పై క్లిక్ చేయకుండా జాగ్రత్త పడండి. అప్పుడే సైబర్ క్రైమ్ బారిన పడరు.
అయోధ్య రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చాలా మీడియా సంస్థలు లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాయి. వాటిని మాత్రమే ఫాలో అవండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి