బీ అలర్ట్‌ .. డేటా ఎంట్రీ జాబ్‌తో సైబర్‌ మోసాలు..

TV9 Telugu

16 February  2024

దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా డేటా ఎంట్రీ జాబ్‌ పేరిట కూడా కొన్ని మోసాలు జరుగుతున్నాయి.

డేటా ఎంట్రీ జాబ్ పేరిట వల వేసి, తర్వాత కంపెనీ నిబంధనలు ఉల్లంఘించారని, బాధితులను బెదిరిస్తూ డబ్బు గుంజుతున్నారు.

దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో వీరి బాధితులు ఉన్నారని సైబర్ పోలీసులు తెలిపారు.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహా నగరం​ పరిధిలోనూ నిత్యం సైబర్​ నేరాలు, సైబర్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

రోజుకో కొత్త పంథాలో సైబర్​ నేరగాళ్లు సైబర్ మోసాలకు తెరలేపుతున్నారు. అమాయక ప్రజలను బురిడీ కొట్టించి, పెద్ద మొత్తంలో సొమ్మును కాజేస్తున్నారు.

సైబర్‌బాద్‌ సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌లో ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్‌ చేసి, కోర్టు ముందు హాజరు పరిచినట్లు వెల్లడించారు.

ఫేక్‌ నోటీసులకు భయపడి ఓ ఫిర్యాదుదారు రూ.6,17,600 చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. గుజరాత్‌కు చెందిన నలుగురు నిందుతులను సైబరాబాద్‌ సైబర్ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వీరిలో ఏ1గా ఉన్న వ్యక్తి గతంలో టెలీకాలర్​గా పనిచేశాడని తన మిత్రులతో కలిసి ఇలా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నాడని తెలిపారు.