ఆన్‌లైన్ టాస్క్.. ప్రీపెయిడ్ ఇన్వెస్ట్‌మెంట్ టాస్కుల్లో చేరారా... జేబులు ఖాళీ!
22 October 2023
నిరుద్యోగులు, వ్యాపారులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే లక్ష్యంగా ఆన్లైన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ళు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికగా చిన్న చిన్న టాస్క్‌లు చేస్తే చాలు.. లక్షల్లో ఆర్జించవచ్చని మోసపూరిత ప్రకటనలు.
నిరుద్యోగులు, పార్ట్ టైమ్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పేరుతో బంపర్ ఆఫర్ అంటూ సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు, ఈమెయిల్స్ పంపుతూ ముగ్గులోకి దించుతున్నారు.
ఆన్‌లైన్‌లో లింక్ మెసేజ్ పెట్టి.. చిన్న టాస్క్ ఇచ్చి పూర్తి చేసిన వెంటనే రూ.100 నుండి రూ.500 వరకు అకౌంట్ పంపి నమ్మకం కల్గిస్తారు.
ట్రాప్‌లో చిక్కుకున్న వారిని టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ చేసి.. ప్రీపెయిడ్ టాస్కుల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయని లింకులు పెడతారు.
వెబ్‌సైట్‌లో రిజిస్టర్/సైనప్ చేసుకోవడానికి కొంత ఫీజు కట్టించుకుని ఫ్రీ పెయిడ్ టాస్క్ చేశాక అదనంగా కొంత బోనస్ కలిపినట్టు నమ్మిస్తారు.
ఒక్కో టాస్క్‌లో ఎక్కువ అమౌంట్ కట్టించుకుంటూ.. భారీ ప్రాఫిట్ ఆన్‌లైన్ వాలెట్లో చూపిస్తారు. లక్షల్లో ఇన్వెస్ట్ చేయిస్తారు..
చివరకు టాస్క్ తప్పుగా చేశారని ఆన్‌లైన్ ఖాతాలో చూపించిన నగదును విత్ డ్రా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్ళు.
అదనపు ఆదాయాన్ని పొందాలనే ఆశతో ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును స్కామర్‌లకు పెట్టుబడి పెట్టి నష్టపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి