బీ అలర్ట్.. పండగల వేళ మోసాలకు తెగబడుతున్న సైబర్ చీటర్లు..
13 October 2023
దసరా నుంచి న్యూఇయర్ వరకు ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారులను ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్లు అందిస్తున్నాయి.
ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు అత్యంత తక్కువ ధరకే ఖరీదైన వస్తువులు అందజేస్తామని ఆశచూపుతూ డబ్బులు దోచేస్తున్నారు.
ఆన్‌లైన్ విక్రయాలు భారీగా పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో దోపిడీకి వెనుకాడటం లేదు.
ఈ కామర్స్ సంస్థల పేర్లతో ఎస్సెమ్మెస్‌లు పంపి మోసాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో బోగస్ ప్రకటనలు ఇస్తున్నారు.
‘తక్కువ ధరల’కు ఆశపడేవారు మోసగాళ్ల వలలో పడుతున్నారు. అలంటి వారి ఏ లింక్స్ పడితే ఆ లింక్స్ ఓపెన్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.
ఇప్పటికే భారీ ఫిర్యాదులు వస్తుండటంతో సైబర్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
వినియోగదారులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుందిని సైబర్ పోలీసుల హెచ్చరిస్తున్నారు.
మీ డబ్బులు విషయంలో ఎప్పుడు జాగ్రత్తలు వహించండి. ఏ మాత్రం అనుమానం వచ్చిన వెంటనే సైబర్ పోలీసులకు పిర్యాదు చెయ్యండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి