28 November 2023

ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డుకట్ట.. UPI చెల్లింపునకు 4 గంటలు.?

పెరుగుతున్న ఆన్‌లైన్‌ లావాదేవీల మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం సరికొత్త వ్యూహం 

ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక స్థాయి మొత్తానికి మించి జరిగే తొలి ట్రాన్సాక్షన్‌ను నిర్దిష్ట సమయం పాటు నిలిపి ఉంచనుంది 

ఏమైనా తప్పు జరిగినట్లు గుర్తిస్తే ఆ సమయంలో ట్రాన్సాక్షన్‌ను రద్దు చేసుకునే వెసులుబాటు ఉంటుంది

ఐఎంపీఎస్‌, ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌తో పాటు యూపీఐ చెల్లింపులకు కూడా ఈ కొత్త నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది

ఇప్పటికే కొత్తగా క్రియేట్‌ చేసిన అకౌంట్‌లకు ఈ నిబంధన అమల్లో ఉన్న విషయం తెలిసిందే. 

కొత్తగా యూపీఐ ఖాతా తెరిచినప్పుడు తొలి 24 గంటల్లో కేవలం రూ.5,000 చెల్లింపునకు మాత్రమే అవకాశం ఉంటుంది.

అలాగే నెఫ్ట్‌లో తొలి 24 గంటల్లో రూ.50,000 మాత్రమే పంపగలం. కానీ, తాజా ప్రణాళిక ప్రకారం గత చరిత్రతో సంబంధం లేకుండా..

ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే తొలి లావాదేవీలన్నింటికీ రూ.2,000 దాటితే మాత్రమే నాలుగు గంటల వ్యవధి నిబంధనను వర్తింపచేయనున్నారు