ప్రపంచంలోనే హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ను తీసుకొచ్చిన చైనా..

19 November 2023

ప్రపంచంలోనే హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ను తీసుకొచ్చింది చైనా.. సెకనులో 150 ఒకేసారి సినిమాలు డౌన్‌లోడ్‌ చేయొచ్చు!

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ను విజయవంతంగా వినియోగంలోకి తెచ్చింది డ్రాగన్ దేశం చైనా.

సెకనులో 1.2 టెరాబైట్‌ (టీబీ) డాటాను ఈ నెట్‌వర్క్‌ ద్వారా విజయవంతంగా సరఫరా చేయొచ్చు. అంటే సెకనులో 1200 గిగాబైట్‌ (జీబీ) డాటా అన్నమాట.

ప్రపంచంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక ఇంటర్నెట్‌ టెక్నాలజీ అత్యధికంగా సెకనుకు 100 జీబీ డాటాను మాత్రమే మార్పిడి చేయగలదు.

ఇటీవల అమెరికా సెకనుకు 400 జీబీ డాటాను మార్పిడి చేయగల నెట్‌వర్క్‌ను నిర్మించింది. దీంతో పోల్చితే చైనా నెట్‌వర్క్‌ నాలుగింతలు.

ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ నిర్మాణం కోసం చైనా దేశంలో పరిశోధన పదేళ్ల పాటు కొనసాగిందని సమాచారం.

ఈ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ను బీజింగ్‌, వుహాన్‌, గాంగ్‌ఝౌ మధ్య 3000 కిలోమీటర్ల పొడవున ఏర్పాటుచేశారు.

సింఝువా యూనివర్సిటీ, హువావే టెక్నాలజీస్‌, సెర్నెట్‌ కార్పొరేషన్‌ కలిసి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించినట్టు సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పత్రిక తెలిపింది.