16 October 2024
Subhash
ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలతో బీఎస్‌ఎన్‌ఎల్ పోటీ పడబోతోంది.
తమ వినియోగదారుల కోసం ప్రత్యేక ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకవస్తోంది. తక్కువ ధరల్లో రీచార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతోంది.
పబ్లిక్ సెక్టార్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ BSNL భారత్ ఫైబర్ కోసం ఫెస్టివల్ ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 499 అతి చిన్న ప్లాన్‌ను అందిస్తోంది.
బీఎస్ఎన్ఎల్ ప్లాన్ రూ.100 తగ్గి రూ.399కి చేరుకుంది. మీరు మూడు నెలల పాటు భారత్ ఫైబర్ సేవను ఆస్వాదించవచ్చు.
ఈ మూడు నెలల తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్ రూ.499 వసూలు చేస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్ 3300 GB వరకు వినియోగానికి 60 Mbps వేగాన్ని అందిస్తోంది.
అంతేకాదు, ఇప్పుడు భారత్ ఫైబర్ కనెక్షన్ తీసుకునే వారికి మొదటి నెల సర్వీస్ ఉచితంగా అందజేస్తోంది బీఎస్‌ఎన్‌ఎల్ కంపెనీ.
BSNL 24వ వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ తన కస్టమర్లకు అత్యుత్తమ ఆఫర్లను అందిస్తోంది. తక్కువ ధరల్లో ఫైబర్ సేవలు అందిస్తోంది.
గతంలో బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 500 కంటే ఎక్కువ రీఛార్జ్‌ల కోసం 24 జీబీ అదనపు డేటా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.