సిమ్‌ స్వాపింగ్‌ స్కామ్‌తో జాగ్రత్త.. ఏంటీ మోసం..?

31 October 2023

సిమ్‌ స్వాపింగ్‌ స్కామ్‌'లో భారతదేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళా న్యాయవాది రూ.50 లక్షలు పోగొట్టుకున్నారు.

ఆమెకు ఇటీవల తెలియని నెంబర్‌ నుంచి మూడు మిస్డ్‌ కాల్స్‌ వచ్చాయి. ఆమె వేరే నెంబర్‌ నుంచి ఆ తెలియని నెంబర్‌కు కాల్‌ చేసింది.

అవతలి వ్యక్తి కొరియర్‌ సర్వీస్‌ నుంచి కాల్‌ చేశానని చెప్పి ఆ మహిళా న్యాయవాది ఇంటి అడ్రస్‌ తీసుకున్నాడు.

అంతే.. కొద్ది సేపటికి ఆమె బ్యాంక్‌ ఖాతా నుంచి రెండు లావాదేవీలు జరిగినట్టు ఆమెకు మేసేజ్‌లు వచ్చాయి. ఆమె ఎలాంటి ఓటీపీ షేర్‌ చేయలేదు.

ఇందులో స్కామర్‌ సిమ్‌ కార్డ్‌ యాక్సెస్‌ పొందుతాడు. తన వద్ద ఉన్న సిమ్‌ కార్డుకు మీ నెంబర్‌ను లింక్‌ చేసేలా నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌ను మోసగిస్తాడు.

మీ సిమ్‌ కార్డ్‌ లాక్‌ అయితే వెంటనే మీరు సర్వీస్‌ ప్రొవైడర్‌ను సంప్రదించి మీ నంబర్‌ను బ్లాక్‌ చేయాలి.

దీని ద్వారా మీ యూపీఐ, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ను బ్లాక్‌ చేసుకోవాలి. తరచూ మీ పాస్‌వర్డ్‌లను మార్చుతూ ఉండాలి.

మీకు ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే జాగ్రత్త పడండి. పొరపాటున కూడా వాళ్ళు అడిగిన మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వకండి.