ఈ-మెయిల్స్‌లో వచ్చే QR కోడ్‌లను స్కాన్ చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త!

28 October 2023

కంప్యూటర్ వైరస్, ట్రోజన్స్, స్పైవేర్, రాన్సమ్ వేర్, యాడ్ వేర్, వార్మ్స్, ఫైల్ లెస్ మార్వెల్స్ సాయంతో సైబర్ దాడులు.

ఇటీవల కాలంలో ఈమెయిల్స్ ద్వారా ఫిషింగ్ అటాక్స్ పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్న సైబర్ సెక్యూరిటీ కంపెనీలు.

QR కోడ్‌ సాయంతో ఫిషింగ్, స్కామ్ పేజీ లింకుల ద్వారా ఎన్‌కోడ్ చేయడానికి వాడుతున్నారు సైబర్ దొంగలు. జాగ్రత్తగా ఉండండి.

ఫిషింగ్, స్కామ్ పేజీ దాడి నుంచి ఇంటర్నెట్ యూజర్లు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ సెక్యూరిటీ కంపెనీలు.

ప్రముఖ బ్రాండ్లు, వివిధ కంపెనీల నుంచి మోసపూరిత మెసెజెస్ పంపుతూ.. డబ్బులు లాగేసుకుంటున్న సైబర్ హ్యాకర్లు.

ఈ మెయిల్స్‌లో ఆఫర్ వచ్చిందనో.. ఇంటర్వ్యూకు రమ్మని.. ఇందు కోసం రిజిస్ట్రేషన్ లేదా మెంబర్ షిప్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న కేటుగాళ్లు.

QR కోడ్‌ను బ్లాక్ చేయడానికి ఎలాంటి ఆప్షన్ లేదు. అందుకే సైబర్ నేరగాళ్లు స్కామ్ లింక్‌లను ఎన్‌కోడ్ చేయడానికి వాడుతున్నట్లు గుర్తింపు.

QR కోడ్‌లను స్కాన్ చేసినప్పుడు వినియోగదారులు నకిలీ వెబ్‌సైట్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న సైబర్ నిపుణులు.