ఫోన్‌, ఛార్జర్‌ ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ను ఎవరైనా గిఫ్ట్‌గా ఇస్తున్నారా? జాగ్రత్త!

22 November 2023

ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌లో బగ్‌ ఇన్‌స్టాల్‌ చేశారన్న విషయం తెలిసేలోపు జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. సాంకేతిక పరిభాషలో ‘ఆల్టర్నేటివ్‌ జూస్‌ జాకింగ్‌’ అని అంటారు.

కార్పొరేట్‌ కుట్రలకు సెల్‌ఫోన్‌ ‘స్పూఫింగ్‌ డివైజ్‌’గా మారింది. చార్జర్‌లోనూ రహస్య సాఫ్ట్‌వేర్‌ను జొప్పిస్తున్నారు. చార్జింగ్‌ పూర్తయ్యేలోపు డేటా మొత్తం బదిలీ అయిపోతుంది.

ఎయిర్‌పోర్టులు, మాల్స్‌, బస్సు, రైలు ప్రయాణాల్లో అపరిచితులు, కొన్నిసార్లు పరిచయస్థుల చార్జింగ్‌ పరికరాల్ని వాడకపోవడమే ఉత్తమం, సురక్షితం.

సెల్‌ఫోన్‌ యాక్టివేట్‌ చేసుకుంటున్నప్పుడు.. అలవ్‌ టు ట్రాక్‌, అలవ్‌ నాట్‌ టు ట్రాక్‌ అనే ఆప్షన్స్‌ వస్తాయి. ట్రాకింగ్‌ను అనుమతించకపోవడమే మేలు.

ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయగలిగిందంతా ఒక్కటే. జాగ్రత్తగా ఉండటం. వివేకంతో స్పందించడం. విచక్షణతో సాంకేతికతను ఉపయోగించడం.

మీరు ఏ రుణం కోసమో అప్‌లోడ్‌ చేసిన ఆధార్‌ నుంచి మీ పేరు, వయసు, చిరునామా సేకరిస్తారు. మీ లావాదేవీల నుంచి మీ ఆర్థిక పరిస్థితిని విశ్లేషించుకుంటారు.

మీ సోషల్‌ మీడియా పోస్టుల ఆధారంగా అభిరుచులు, అభిప్రాయాలు తెలుసుకుంటారు. మీ అవసరాలను అర్థం చేసుకుంటారు.

మీ గురించి మీ మిత్రులు, మీ కుటుంబసభ్యుల కంటే ఎక్కువే తెలుస్తుంది. దీన్నే ‘సోషల్‌ ప్రొఫైలింగ్‌’ అంటారు. మీ బలహీనతలు, అవసరాలు తెలిశాక చిటికెలో గాలం వేస్తారు.