జియో స్పేస్ ఫైబర్ సేవలు షురూ..! ఇవీ ప్రయోజనాలు..

28 October 2023

తొలిసారి దేశంలో శాటిలైట్ ఆధారిత గిగా ఫైబర్ సర్వీస్‌ను ప్రారంభించిన దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.

ఇంటర్నెట్ సౌకర్యం లేని మారుమూల పల్లెపల్లెలకు సైతం వేగంగా బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించేందుకు జియో ఫ్లాన్.

భారత్ మొబైల్ కాంగ్రెస్‌లో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ‘జియో స్పేస్ ఫైబర్’ సర్వీస్‌‌ను శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియో.

శాటిలైట్ టెక్నాలజీ కోసం ‘జియో ఎస్ఈఎస్’, ‘మీడియం ఎర్త్ ఆర్బిట్’ సంస్థల కీలక ఒప్పందం మేరకు జియో జాయింట్ వెంచర్ ప్రారంభం.

దేశంలో ఎస్ఈఎస్ సంస్థ ఆధ్వర్యంలోని ఓ3బీ, ఓ3బీ రిలయన్స్ జియోకు ఎంపవర్ శాటిలైట్ నెట్‌వర్క్ యాక్సెస్ అవుతుంది.

గిగాబైట్, స్పేస్ నుంచి ఫైబర్ తరహా సేవలు అందించేందుకు ఎంఈఓ ఉపగ్రహాల కూర్పు సాయపడతుందన్న రిలయన్స్ జియో.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రిలయన్స్ జియోకు ఫిక్స్‌డ్ లైన్, వైర్‌లెస్ రూట్లలో 45 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు తెలిపిన జియో.

ప్రతి ఇంటికి డిజిటల్ సేవలు అందించడమే లక్ష్యంగా జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన రిలయన్స్ సంస్థ.

మారుమూల ప్రాంతాలతో సహా ప్రపంచ నలుమూలల ఇంటర్నెట్ సేవలు అందించడంలో రిలయన్స్ జియో సరసన చేరిన జియో స్పేస్ ఎయిర్ ఫైబర్.