అంగారకుడిపై వేడి ఉంటుందా..? చల్లగానా..?
TV9 Telugu
05 November 2024
అంగారక గ్రహం దాని అనుబంధ లక్షణాలు ఎల్లప్పుడూ ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి, ఉష్ణోగ్రత పరంగా కూడా చాలా భిన్నంగా ఉంటాయి.
ఈ గ్రహంపై ఇనుము పుష్కలంగా ఉండటం వల్ల దీని రంగు ఎరుపు రంగులో ఉందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది.
ఈ గ్రహం ఎరుపు రంగును చూసి చాలా మంది అంగారకుడి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని, అంటే వేడి గ్రహంగా ఉంటుందని భావిస్తున్నారు.
అంగారకుడి సగటు ఉష్ణోగ్రత మైనస్ 65 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే, ఈ గ్రహం చాలా చల్లగా ఉంటుందని తెలిపిన నాసా.
మార్స్ సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగే సమయం 687 రోజులు . తన చుట్టూ తాను తిరగడానికి 24.6 గంటల సమయం పడుతుంది.
అంగారకుడిపై పూర్తి రోజును సౌర దినం అంటారు. దీనిని సంక్షిప్తంగా సోల్స్ అని కూడా అంటారని తెలిపారు శాస్త్రవేత్తలు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ గ్రహంపై ఇద్దరు చంద్రులు ఉన్నారు. మొదటి చంద్రుని పేరు ఫోబోస్, రెండవ చంద్రుని పేరు డెమోస్.
అంగారక గ్రహం భూమి వ్యాసంలో దాదాపు సగం ఉంటుంది. పొడి భూమి మొత్తం వైశాల్యం కంటే ఉపరితల వైశాల్యం కొద్దిగా తక్కువగా ఉంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి