స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా ?? అయితే ఈ టిప్స్ మీకోసమే
ఫోన్‌లో బ్రౌజర్‌ను వాడేటప్పుడు ఇన్‌కాగ్నిటో మోడ్‌ను గానీ, వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ను గానీ ఎంచుకోండి .
లాగిన్‌లో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉండే విధంగా చూసుకోండి
సామాజిక మాధ్యమాల్లో మీ పోస్టులుగానీ, వివరాలు గానీ ‘స్టే ప్రైవేట్’ ఉండేలా సెట్టింగ్స్ మార్చుకోండి
ఉచితంగా వస్తుంది కదా అని పబ్లిక్ వైఫై ఉపయోగించకండి. మెసేజింగ్ యాప్స్ ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ ఉండే విధంగా చూడండి .
అన్ని గ్యాడ్జెట్స్, సోషల్ మీడియా అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్ ఉన్నట్లయితే వెంటనే మార్చండి. ప్రతి దానికీ ప్రత్యేకమైన, కఠినమైన పాస్ట్‌వర్డ్ ఎంచుకోండి .
సోషల్ మీడియా అకౌంట్లను స్మార్ట్‌ఫోన్ కన్నా డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లో వాడేలా చూడండి
స్మార్ట్‌ఫోన్ ఎంతసేపు వాడుతున్నారనేది చూడండి. ఐ ఫోన్ యూజర్లు ‘స్క్రీన్ టైమ్’ యాప్ ద్వారా, ఆండ్రాయిడ్ యూజర్లు ‘డిజిటల్ వెల్‌బీయింగ్’ యాప్ ద్వారా స్క్రీన్ టైమ్ తగ్గించుకోవచ్చు.