02 June 2024
TV9 Telugu
ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కానున్న ఐఫోన్ 16 సిరీస్‌లో కీలక డిజైన్ మార్పులకు యాపిల్ కసరత్తు సాగిస్తోందని చెబుతున్నారు.
డయాగ్నల్ కెమెరా స్ధానంలో వర్టికల్ (నిలువు) కెమెరా లేఅవుట్‌ను తిరిగి ప్రవేశపెడుతుందని భావిస్తున్నారు.
ఐఫోన్ ఎక్స్, 11లో మనం చూసే తరహా వర్టికల్ సెటప్‌ను యాపిల్ లేటెస్ట్ సిరీస్‌లో తీసుకురానున్నట్టు సమాచారం.
వర్టికల్ కెమెరా అలైన్‌మెంట్ కేవలం స్టైలిష్ లుక్ కోసం మాత్రమే కాకుండా ఫంక్షనాలిటీ కోసం యాపిల్ డిజైన్ చేసింది.
ప్రస్తుతం ఐఫోన్ 15ప్రొ, ప్రొ మ్యాక్స్‌లో స్పేషియల్ వీడియో రికార్డు సామర్ధ్యం ఉంది. ఈ ఫీచర్ కోసం వర్టికల్ అలైన్‌మెంట్‌తో కూడిన కెమెరాలు అవసరం.
దీంతో అలైన్‌మెంట్‌తో కూడిన కెమెరాలు అవసరం కావడంతో ఐఫోన్ 16 సిరీస్‌లో తరహా కెమెరా లేఅవుట్‌కు యాపిల్ మొగ్గు చూపింది.
ఐఫోన్ 16, 16 ప్లస్ వంటి బేస్ మోడల్స్‌కూ వర్టికల్ లేఅవుట్ కెమెరా లేఅవుట్‌ను తీసుకురావడం ద్వారా పెద్దసంఖ్యలో యూజర్లకు స్పేషియల్ వీడియో రికార్డింగ్ ఫీచర్.
నాన్-ప్రొ మోడల్స్‌లో కెమెరా అప్‌గ్రేడ్‌కు మార్గం సుగమం చేయడంతో పాటు అదనపు కెమెరా మాడ్యూల్స్‌కు అధిక స్పేస్‌ను అందించే వెసులుబాటు కల్పిస్తుంది.