చాట్‌ జీపీటీ-4 ఫ్రీ కాదు.. ప్రత్యామ్నాయాలు ఇవిగో.....!

12 December 2023

చాట్‌జీపీటీ అంటే ఆన్‌లైన్‌ సెర్చ్‌ను కొత్త పుంతలు తొక్కించిన తాజాగా సంచలనంగా మారిందని చెబుతున్నారు నిపుణులు.

మెయిళ్లు రాయడం మొదలుకొని కథలల్లడం వరకూ ఎన్నో పనులను చిటికెలో చక్కబెట్టేయగలదు కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీ.

అయితే జీపీటీ 4ను వాడటం పూర్తిగా ఉచితం కాదు. కొంతవరకూ ఫ్రీగా వాడుకోవచ్చు కానీ ఆ తరువాత మాత్రం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

మరి సమాచారం ఉచితంగా పొందాలంటే? ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు బోలెడున్నాయని తెలుపుతున్నారు టెక్ నిపుణులు.

గూగుల్‌కు బదులుగా ఏఐ ఆధారిత సెర్చింజన్‌ బింగ్‌నూ వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన దీనిలో ఏఐ ఆధారిత జీపీటీ-4 కూడా ఉంది.

దీని వెబ్‌సైట్‌లోకి వెళ్లి బింగ్‌ చాట్‌తో బోలెడన్ని విషయాలు తెలుసుకోవచ్చు. యాప్‌ రూపంలోనూ దీని సేవలను పొందొచ్చు.

కంటెంట్‌ను సృష్టించుకోవచ్చు, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. బింగ్‌లోని రైటింగ్‌ అసిస్టెంట్‌ సాయంతో మెయిళ్లు రాసుకోవచ్చు.

ఇప్పుడు తేలుసుకున్నారుగా ప్రత్యామ్నాయాలు ఏంటో.. ఇంకా వీటి ద్వారా ఖర్చు లేకుండా చాట్‌ జీపీటీ-4ని ఉపయోగించుకొండి.