ఫస్ట్ సూపర్‌కార్.. స్పెషల్ అట్రాక్షన్!

10 October 2023

ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులను ఆకట్టుకుంటున్న ఖతార్‌లోని దోహా వేదికగా ప్రతిస్త్మాకంగా జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో.

అక్టోబర్ 5 నుంచి దోహాలో ప్రారంభమైన జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో. ప్రపంచంలోని చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి.

జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన సూపర్ కారు. తాలిబన్ నియంత్రణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో మాడా 9 ఆధారంగా తయారైన సూపర్‌కారు.

కాబూల్‌కు చెందిన తయారీ సంస్థ ఎన్‌టాప్‌ అండ్ ఆఫ్ఘనిస్తాన్ టెక్నికల్ వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేసిన కారుకి 'సిముర్గ్' నామకరణం.

ఆఫ్ఘనిస్తాన్‌లో తయారైన మొట్టమొదటి స్వదేశీ సూపర్‌కారు సిముర్గ్.  బ్లాక్ కలర్‌ పెయింట్ థీమ్‌ కలిగిన ఈ కారుని 30 మంది ఆఫ్ఘన్ ఇంజనీర్లు రూపొందించారు.

సూపర్‌కారు సిముర్గ్‌లో కరోలా నుంచి తీసుకున్న ఫోర్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌, షార్ప్ ఫ్రంట్ స్ప్లిటర్, పెద్ద బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఫ్లేర్డ్ ఫెండర్లు అమర్చారు.

ఎయిర్ ఇన్‌టేక్ కోసం ప్రత్యేకంగా తయారైన సైడ్ ప్రొఫైల్, ఎల్ఈడీ టెయిల్‌లైట్లు, బోల్డ్-లుకింగ్ రియర్ డిఫ్యూజర్ వంటివి పొందుపర్చారు.

సిముర్గ్‌ సూపర్‌కారు కేవలం ప్రోటోటైప్ దశలో ఉన్న కారు ఉత్పత్తి చేసేందుకు తయారీదారుల కోసం ఎదురుచూస్తున్నారు.