ఆదిత్య ఎల్ 1 భూ కక్ష్య పెంపు సక్సెస్..

03 September 2023

సూర్యుడిపై ప్రయోగం చేపట్టిన భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) తొలి విజయన్ని సాధించింది. ఆదిత్య ఎల్ 1 తొలి భూకక్ష్య పెంపు సక్సెస్ అయింది.

సెప్టెంబర్ 2న నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్‌-1.. లాంగ్రాంజ్‌ పాయింట్‌-1 వైపు పయనం. సూర్యుడిపై సోలార్ స్టార్మ్స్‌ను స్టడీ చేయనున్న ఆదిత్య ఎల్‌-1.

భూమి నుంచి సూర్యుడివైపు 125 రోజులు, 4నెలల పాటు ప్రయాణించి ఎల్‌-1 పాయింట్‌కి చేరుకోనున్న ఆదిత్య ఎల్ 1 శాటిలైట్.

ఆదిత్య ఎల్‌1 ప్రయోగం కోసం ఖర్చు రూ.400కోట్లు అయింది. 5 సంవత్సరాలకు పైగా ఆదిత్య ఎల్‌1 శాటిలైట్ లైఫ్‌ టైమ్‌.

2024 ఫిబ్రవరి నెలాఖరు నుంచి రెగ్యులర్‌ డేటాను ఇస్రోకు అందించనున్న ఆదిత్య ఎల్‌1 సన్ మిషన్ శాటిలైట్.

ఆదిత్య ఎల్‌ 1 శాటిలైట్ లో ఉపయోగించిన యాంటెనాలు హైదరాబాద్ ఈసీఐఎల్‌‌లో తయారుచేసి ఇస్రోకు తీసుకొనే వెళ్లారు.

ఆదిత్య ఎల్‌ 1 శాటిలైట్ కోసం గ్రౌండ్‌ యాంటెనా నెట్‌వర్క్‌ను అందించిన హైదరాబాద్ కు చెందిన ఈసీఐఎల్‌ సంస్థ.

ఈ శాటిలైట్ కోసం 18 మీటర్ల యాంటెనా వ్యవస్థ ఇండిజినెస్‌ డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ను అందించిన ఈసీఐఎల్ సంస్థ.