సంసారం గుట్టురట్టు చేస్తున్న కార్లు.. ఎలాగో తెలుసా.?
07 September 2023
ప్రస్తుతం కార్లు కూడా స్మార్ట్‌గా మారిపోతున్నాయి. కార్లన్నీ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి పని చేస్తున్నాయి. అయితే ఇదే తరుణంలో ఇది వ్యక్తిగత సమాచారాన్ని దొంగలిస్తున్నట్లు తేలింది.
స్మార్ట్ కార్ల కారణంగా వ్యక్తిగత సమాచార గోప్యత దెబ్బతింటోందని ఓ ప్రముఖ సంస్థ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
కాలిఫోర్నియాకు చెందిన మొజిల్లా ఫౌండేషన్ 25 రకాల కార్లపై అధ్యయనం చేసిన తర్వాత పలు ఆసక్తికర విషయాలను తెలిపింది.
ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యే కార్లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఈ సంస్థ పేర్కొంది.
వినియోగదారుల లైంగిక కార్యకలాపాలు మొదలు ఇతర సెన్సిటివ్ డేటాను ఓ కంపెనీ సేకరించే ప్రయత్నం చేసినట్లు మొజిల్లా అంటోంది.
కొన్ని రకాల కార్లు యూజర్ల పర్సనల్ డేటాను సంస్థలతో పంచుకునేందుకు ఒప్పందం చేసుకున్నట్లు మొజిల్లా అధ్యయనంలో తేలింది.
ఇప్పటికే 76 శాతం కంపెనీలు వినియోగదారులు డేటాను ఇతర కంపెనీలకు అమ్మేసినట్లు మొజిల్లా చెబుతోంది.
కారులో ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థ, రేడియో, మ్యాప్స్‌తోపాటు వాయిస్ అసిస్టెంట్ డివైజ్‌ల ద్వారా యూజర్ల పర్సనల్ డేటాను సేకరిస్తున్నట్లు సంస్థ పేర్కొంది.