03 october 2023

భూమికి దగ్గరగా వస్తున్న భారీ గ్రహశకలం.. 

లక్ష్యం లేకుండా తిరుగుతన్న ఓ భారీ గ్రహశకలాన్ని అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ నాసా గుర్తించింది.  

భూమికి అత్యంత సమీపంగా వెళ్లే గ్రహశకలాలతో కూడిన ఓ జాబితాను సిద్ధం చేసింది నాసా.

భూగ్రహం దిశగా  ‘2023 ఎస్‌ఎన్‌6’ అనే  గ్రహశకలం దూసుకొస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

గురుత్వాకర్షణ శక్తి కారణంగా కాస్మిక్‌ నొమాడ్, ఖగోళ వస్తువులు, ఇతర గ్రహాలకు దగ్గరగా వస్తాయంటున్న శాస్త్రవేత్తలు

ఒక విమానం పరిమాణంలో ఈ గ్రహశకలం ఉన్నట్లు వెల్లడించిన నాసా శాస్త్రవేత్తలు.

భూమి వైపు దూసుకువచ్చే గ్రహశకలం 4.8 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా.

గ్రహశకలం గంటకు 30,564 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉందని నాసా వెల్లడించింది

భూమికి సమీపంలోని గ్రహశకలాల అపోలో సమూహానికి చెందినది. 

1930 ప్రాంతంలో 1862 అపోలో గ్రహశకలాలను జర్మన్‌ ఖగోళ శాస్త్రవేత్త కార్ల్‌ రీన్ముత్  కనుగొన్నాడు. 

స్పేస్‌ ఏజెన్సీస్‌ సెంటర్‌ ఫర్‌ నియర్‌ ఎర్త్ ఆబ్జెక్ట్స్‌ స్టడీస్‌ మాత్రం తాజా గ్రహశకలాన్ని ప్రమాదకర వస్తువుగా భావించడం లేదు.