వావ్ అనిపిస్తున్న 4 వాట్సాప్‌ నయా ఫీచర్లు..

TV9 Telugu

15 June 2024

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. అందులో ఏది లేకపోయినా వాట్సాప్ మాత్రం కచ్చితంగా ఉంటుంది.

ఇది ప్రజల జీవితంలో భాగం అయిపొయింది. ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాల కోసం కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది వాట్సాప్‌.

కొత్తగా మరో 3 అదిరిపోయే ఫీచర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ వాట్సాప్‌.

తాజాగా ఒకేసారి 32 మందితో వీడియో కాల్ మాట్లాడే సౌకర్యాన్ని కల్పించింది దిగ్గజ సోషల్ మీడియా యాప్ వాట్సాప్‌.

అలాగే ఇప్పటికే వాట్సాప్ లో అందుబాటులో ఉన్న స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ఇకపై ఆడియోతో అందుబాటులోకి వస్తుంది.

మెరుగైన ఆడియో, వీడియో నాణ్యతను అందించేందుకు వాట్సాప్ సంస్థవారు MLow కోడెక్ ఫీచర్‌ను ఉపయోగిస్తున్నారు.

ఈ MLow కోడెక్ ఫీచర్‌తో వాయిస్ క్లారిటీతో పాటు హెచ్‌డీతో వీడియో కాల్ మాట్లాడే సదుపాయాన్ని అందిస్తుంది..

దింతో పాటు 30 సెకన్లు ఉన్న వాట్సాప్ స్టేటస్ ని 60 సెకన్లకి పెంచింది. అంటే ఇప్పుడు 1 నిమిషం వీడియోను స్టేటస్ గా పెట్టవచ్చు.