సైబర్‌ నేరగాళ్ల అకౌంట్లలోకి హైదరాబాదీల సొమ్ము నెలకి రూ.11 కోట్లు.!

21 October 2023

వాట్సాప్‌ లింకులు, కస్టమర్‌ కేర్‌ నంబర్లు, బ్యాంకులు, సీబీఐ.. చివరకు సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌... వేటినీ వదలడం లేదు సైబర్ నేరగాళ్లు.

ప్రభుత్వ లేదా ప్రయివేటు సంస్థలను హాక్ చేసి ఆన్లైన్ ద్వారా తమకు తగ్గట్టుగా మలచుకుంటున్నారు సైబర్ మాయగాళ్లు.

సైబర్ పోలీసుల దగ్గరున్న రికార్డుల ప్రకారం సైబర్‌ కేటుగాళ్లు హైదరాబాద్‌ ప్రజలను 27 అంశాలతో మోసం చేస్తున్నారు.

ఈ ఏడాది కేవలం 9 నెలల్లో 2232 కేసులు నమోదయ్యాయి. రూ. 102,39,10,499 సొమ్ము బాధితులు నష్టపోయినట్టు నిర్దారించారు.

అంటే సైబర్ నేరగాళ్లు నెలకు దాదాపుగా రూ.11 కోట్లను స్వాహా చేస్తున్నారని పోలీసులు నివేదిక ద్వారా తెలుస్తోంది.

సులభంగా ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడి పార్ట్‌టైమ్‌ జాబ్‌ లేదా ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడానికి సిద్ధం కావడం కారణం.

ఇంటి నుంచే ఉపాధి పొందొవచ్చు అంటూ ఊరిస్తారు. వారికి టాస్క్‌లిచ్చి మరో సంపాదన మార్గం చూపుతున్నామంటూ ఉచ్చులో బిగిస్తున్నారు.

ఇలా పెట్టుబడుల వలలో చిక్కిన 1018 మంది ఇప్పటివరకు రూ.69,60,48,689 నష్టపోయారని సైబర్ పోలీసు వర్గాల సమాచారం.