ప్రపంచంలోని 10 ప్రధాన అంతరిక్ష పరిశోధనా సంస్థలు ఇవే!
TV9 Telugu
13 January 2024
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా). ఇది అమెరికాకు సంబంధించిన అంతరిక్ష పరిశోధనా కేంద్రం. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో ఉంది.
చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్ఎస్ఏ). దీని ప్రధాన కార్యాలయం చైనా రాజధాని బీజింగ్‌లో ఉంది.
రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ (రాస్కోస్మోస్). దీని ప్రధాన కార్యాలయం రష్యా దేశం రాజధాని మాస్కోలో ఉంది.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో). దీని ప్రధాన కార్యాలయం భారతదేశంలోని కర్ణాటక రాజధాని బెంగళూరులో కలదు.
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ). దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌దేశ రాజధాని పారిస్ అనే నగరంలో ఉంది.
జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా). దీని ప్రధాన కార్యాలయం టోక్యోలోని చోఫు సిటీలో ఉంది.
నేషనల్ సెంటర్ ఫర్ స్పేస్ స్టడీస్ (సీఎస్ఈఎస్). ఇది ఫ్రాన్స్ దేశానిక సంబంధించిన అంతరిక్ష కేంద్రం. దీని ప్రధాన కార్యాలయం పారిస్‌లో కలదు.
ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ (ఏఎస్ఐ). దీని ప్రధాన కార్యాలయం యూరోపియన్ దేశం ఇటలీ రాజధాని, ప్రముఖ నగరం రోమ్‌లో కలదు.
పోలిష్ స్పేస్ ఏజెన్సీ (పోల్సా). ఇది పోలాండ్‌కు సంబంధించింది. జర్మనీకి చెందిన జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ (డీఎల్ఆర్) పదో స్థానంలో ఉంది.