‘‘మనం కలవడం ఓ అద్భుతం. విడిపోవడం అవసరం’’ అంటున్నారు హీరో కల్యాణ్‌రామ్
రాజేంద్రరెడ్డి తెరెక్కించిన ‘అమిగోస్’ మూవీలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశారు
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది
ఫిబ్రవరి 10న ఈ సినిమా విడుదల నేపథ్యంలో ఆదివారం టీజర్ విడుదల చేశారు
ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మంజునాథ్, సిద్ధార్థ్, మైఖేల్ అనే మూడు పాత్రల్లో సందడి చేశారు
వీటిలో మైఖేల్ పాత్రను నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలా టీజర్ లో చూపించారు
అందులో కల్యాణ్‌రామ్ పలికించిన హావభావాలు, చేసిన యాక్షన్ హంగామా ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి
మైఖేల్‌కి మంజునాథ్, సిద్ధార్థ్ పాత్రలకు మధ్య సాగే పిల్లి ఎలుకా ఆట ఎలా ఉండబోతుందో తెలియాంటే ఫిబ్రవరి 10 వరకు వేచి ఉండాల్సిందే