సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందుతున్న సినిమా ‘రావణాసుర’

సుశాంత్‌ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని అభిషేక్‌ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు

ఈ చిత్రంలో హీరోయిన్స్ గా అను ఇమ్మానుయేల్‌, మేఘ ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్‌, పూజిత పొన్నాడ నటిస్తున్నారు

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో  బిజీగా ఉంది

ఈ చిత్రం వేసవి సందర్భంగా ఏప్రిల్‌ 7న విడుదల కానుంది

ఈ నెల 6న ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది

స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రంలో రవితేజ ట్రెండీగా కనిపిస్తారు

 ఈ వేసవిలో వస్తున్న అత్యంత ఆకర్షణీయ చిత్రాల్లో ఇదొకటని సినీ వర్గాలు తెలిపాయి