2013లో చివరి ఐసీసీ ట్రోఫీ.. ఆ తర్వాత 11 ఛాన్సులు మిస్.. మరలా ఎప్పుడో?
ICC Trophy: మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 5 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఈ ఓటమితో మరోసారి భారత అభిమానుల గుండె పగిలిపోయింది.
సెమీఫైనల్‌లో ఈ ఓటమితో మరోసారి సీనియర్ టీమ్ ఇండియాకు ఐసీసీ ట్రోఫీ సాధించాలనేది కలగానే మిగిలిపోయింది.
సీనియర్ టీం ఇండియా చివరిసారిగా 2013లో ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది.
2013 తర్వాత పురుషులు, మహిళల టీంలు ఐసీసీ ట్రోఫీని గెలవలేకపోయాయి.
2013లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో పురుషుల సీనియర్ జట్టు ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకునేందుకు మొత్తం 11 అవకాశాలు వచ్చాయి.
ప్రతిసారీ టీమిండియా చివరి దాకా వచ్చి ఓటమిని ఎదుర్కొంటుంది.
సెమీ ఫైనల్‌లో లేదా ఫైనల్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది.