వన్డేల్లో టీమిండియా భారీ విజయాలు ఇవే.. బలైన టీంలు ఏవంటే?
శనివారం బంగ్లాదేశ్‌పై భారత్ భారీ విజయాన్ని సాధించింది.
వన్డే ఫార్మాట్‌లో టీమిండియాకు ఇది మూడో అతిపెద్ద విజయంగా నిలిచింది.
2007లో బెర్ముడాపై వన్డేల్లో భారత్ తొలి భారీ విజయం సాధించింది.
బెర్ముడాపై 257 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇక రెండో విజయంలో హాంకాంగ్‌ను 256 పరుగుల తేడాతో టీమిండియా ఓడించింది.
తాజాగా బంగ్లాదేశ్‌పై భారత్ 227 పరుగుల తేడాతో విజయం సాధించింది.
బంగ్లాదేశ్ జట్టు 182 పరుగులకు ఆలౌటైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది.
ఇషాన్ కిషన్ 210 పరుగుల చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు.
ఇషాన్ 131 బంతులు ఎదుర్కొని 24 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు.
విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 113 పరుగులు చేశాడు.
ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లి 11 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.