IND Vs PAK: కోహ్లీ అంటేనే సుస్సు పోసుకుంటోన్న పాకిస్తాన్.. ఎందుకంటే?
ఆసియా కప్ శనివారం అంటే, ఆగస్ట్ 27 నుంచి ప్రారంభం కానుంది.
ఆగస్టు 28న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
ఆసియా కప్‌లో ఇరు జట్ల ఢీకొనడంపై కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పాకిస్థాన్‌పై టీ20లో విరాట్ కోహ్లీ రికార్డు అద్భుతం. పాకిస్థాన్‌పై 7 మ్యాచ్‌ల్లో 311 పరుగులు చేశాడు. కోహ్లీ బ్యాటింగ్ సగటు 77.75గా నిలిచింది. 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఆసియా కప్ గురించి మాట్లాడితే, పాకిస్థాన్‌పై కోహ్లీ సగటు 68 కంటే ఎక్కువ. విరాట్ 3 మ్యాచ్‌ల్లో 206 పరుగులు చేశాడు. ఒక సెంచరీ చేశాడు. 183 పరుగుల అత్యధిక స్కోర్ చేశాడు.
వన్డే-టీ20 ఫార్మాట్లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ మొత్తం 2 సెంచరీలు సాధించాడు. 2 అర్ధ సెంచరీలు కూడా వచ్చాయి. పరిమిత ఓవర్లలోని ప్రతి ఫార్మాట్లో, ప్రతి టోర్నమెంట్లో పాకిస్తాన్‌పై అద్భుతంగా రాణించాడు.
భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న దుబాయ్ మైదానంలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. 2021లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై 57 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
IND Vs PAK: కోహ్లీ అంటేనే సుస్సు పోసుకుంటోన్న పాకిస్తాన్.. ఎందుకంటే?