టీమ్ ఇండియా సీనియర్  ఆటగాడు కేఎల్ రాహుల్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు.

సునీల్ శెట్టి గారలపట్టి, బాలీవుడ్  నటి, తన గర్ల్‌ఫ్రెండ్ అతియా శెట్టిని  పెళ్లి చేసుకునేందుకు సర్వం  సిద్ధం చేసుకున్నాడు రాహుల్.

 వివాహ తేది: జనవరి 21l ప్రారంభమయ్యే ప్రీవెడ్డింగ్ వేడుకల తర్వాత రాహుల్-అతియా జంట జనవరి 23న వివాహం చేసుకోనున్నారు.

వివాహ వేదిక:  రాహుల్-అతియా పెళ్లి మహారాష్ట్రలోని సునీల్ శెట్టి ఖండాలా బంగ్లాలోనే జరగనుందని సమాచారం.

కన్నడ సాంప్రదాయంలో చాలా  గ్రాండ్‌గా జరుపుకోవాలని అనుకుంటున్న ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లను శరవేగంగా చేస్తున్నారు.

2023 లో ఒక్కటి కాబోతున్న రాహుల్-అతియా శెట్టి 2009 నుంచి కలిసే ఉన్నారు.

రాహుల్-అతియా వారి మధ్య రిలేషన్‌షిప్‌ను 2021లో స్వయంగా బహిర్గతం చేశారు.

ఇక తమ గురించి అందరికీ చెప్పేశాక మొహమాటం ఎందుకు అనుకుందో ఏమో.. వరుస ఫోటోలతో ఇన్‌స్టాగ్రామ్‌లో సందడి చేస్తోంది ఈ జంట.