Asia Cup 2022: ఆసియా కప్‌లో 'హిట్‌మ్యాన్' గణాంకాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..

ఆసియా కప్ 2022 ఆగస్ట్ 27 నుంచి ప్రారంభం కానుంది. భారత జట్టు ఆగస్టు 28న పాకిస్థాన్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

ప్రస్తుతం అభిమానుల చూపు భారత కెప్టెన్ రోహిత్ శర్మపైనే ఉంటుంది. ఆసియా కప్‌లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.

సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు భారత కెప్టెన్ నిలిచాడు.

ఆసియాకప్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 27 మ్యాచ్‌లు ఆడాడు. భారత కెప్టెన్ 42.04 సగటు, 90 స్ట్రైక్ రేట్‌తో 883 పరుగులు చేశాడు.

రోహిత్ అత్యధిక స్కోరు 111 నాటౌట్ కాగా, 7 సార్లు 50 పరుగుల మార్కును దాటాడు.

ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో నిలిచాడు.

మాస్టర్ బ్లాస్టర్ 971 పరుగులు చేశాడు. అలాగే అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు రోహిత్ శర్మ.

రోహిత్ శర్మ ఆసియా కప్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేయగలడు. అలాగే సచిన్ టెండూల్కర్ 973 పరుగుల రికార్డును భారత కెప్టెన్ బ్రేక్ చేసే చాన్స్ ఉంది.

T20 ఇంటర్నేషనల్స్‌లో 3500 పరుగుల మార్క్‌ను తాకిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.

ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్టిల్ నిలిచాడు.

అంతర్జాతీయ టీ20ల్లో మార్టిన్ గప్టిల్ 3497 పరుగులు చేశాడు. కాగా, ఈ ఫార్మాట్‌లో ఇప్పటివరకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 3,487 పరుగులు చేశాడు.