IPL 2023: ఆ ఆల్ రౌండర్ విషయంలో ధోనికి భారీ షాక్..
కోల్‌కతా నైట్ రైడర్స్ శార్దూల్ ఠాకూర్‌ను దక్కించుకుంది.
IPL 2023కి ముందు ట్రేడింగ్ విండో ముగిసేలోపు KKR శార్దూల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి ట్రేడ్ చేసింది.
ఎంఎస్ ధోని టీం చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ కూడా శార్దూల్ కోసం ప్రయత్నించాయి.
శార్దూల్ ప్రస్తుతం టీమ్ ఇండియాతో కలిసి న్యూజిలాండ్ టూర్‌లో ఉన్నాడు. వన్డే జట్టులో సభ్యుడిగాను ఉన్నాడు.
ఐపీఎల్ 2022లో ఢిల్లీ టీంను శార్దూల్‌ను రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారి కేకేఆర్ జెర్సీలో కనిపించనున్నాడు.
ఐపీఎల్ 2022లో శార్దూల్ 14 మ్యాచ్‌ల్లో మొత్తం 15 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ రేటు 9.79గా నిలిచింది.
బ్యాటింగ్‌తో 120 పరుగులు చేశాడు. శార్దూల్ స్ట్రైక్ రేట్ 138గా ఉంది.
IPL 2023 ట్రేడింగ్ విండో మంగళవారం ముగిసిపోనుంది.
ట్రేడ్ ద్వారా KKRలో చేరిన మూడో ఆటగాడి శార్దూల్ నిలిచాడు.
అంతకు ముందు లాకీ ఫెర్గూసన్, రహమతుల్లా గుర్బాజ్‌లను కేకేఆర్ టీం గుజరాత్ టైటాన్స్‌తో ట్రేడ్ చేసింది.