ఆదాయపన్ను చట్టం కింద ఫ్రీలాన్స్ ఉద్యోగాలు చేసే వారి ఆదాయం సైతం చట్టపరంగా పన్ను విధింపబడుతుంది
టాక్స్ లెక్కించేటప్పుడు ఈ ఆదాయాన్ని వృత్తి వ్యాపారం నుంచి వచ్చే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ కింద పరిగణిస్తారు
ఇందుకోసం సదరు టాక్స్ పేయర్ ITR-3 లేదా ITR-4 కింద ఆదాయపన్ను దాఖలు చేయాల్సి ఉంటుంది
పన్ను చెల్లింపుదారు 12 నెలల కాలంలో తనకు వివిధ మార్గాల ద్వారా వస్తున్న ఆదాయాన్ను నిర్ణయించుకోవాలి
చాలా మంది యజమానులు ఫ్రీలాన్సర్లకు చేసే చెల్లింపుల్లో ముందుగా TDSని మినహాయిస్తుంటారు
అందువల్ల పన్ను లెక్కించేటప్పుడు టీడీఎస్ ను పరిగణలోకి తీసుకోవాలి
ఫ్రీలాన్స్ ద్వారా ఆదాయం రూ.10 వేల కంటే ఎక్కువ ఉండే వారు ప్రతి త్రైమాసికంలోనూ గడువుకు ముందే.. అడ్వాన్స్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది
మీరు లెక్కించే పూర్తి పన్ను రూ. 10,000 కంటే ఎక్కువ అయితే.. మీరు ఆదాయపన్ను చట్టంలోని వివిధ సెక్షన్లపై దృష్టి సారించాల్సి ఉంటుంది