గుర్తుందా శీతాకాలం తర్వాత వరుస సినిమాలకు సైన్‌ చేస్తోంది తమన్నా.

ప్రస్తుతం ఆమె చేతిలో పలు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. 

ప్రస్తుతం తమన్నా మెగాస్టార్‌ చిరంజీవి భోళాశంకర్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది.

రజనీకాంత్‌ జైలర్‌లోనూ కథానాయకిగా నటిస్తోంది.

చిరంజీవి, రజనీకాంత్‌లతో నటించడంపై తెగ సంబరపడిపోతోంది తమన్నా.

'రజనీ సార్‌తో కలిసి పనిచేస్తాననుకోలేదు. నా కల నిజమైంది' అని మురిసిపోతోంది.

చిరంజీవితో కలిసి మళ్లీ డ్యాన్స్‌ చేయడానికి ఉత్సాహంగా ఉన్నానంటోందీ మిల్కీబ్యూటీ..