మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah).. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నటించిన బ్యూటీస్ లో ఈ భామ ఒకరు.
అందం అభినయం కలబోసిన ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక ఈ చిన్నదానికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి మెప్పించింది ఈ బ్యూటీ.
అలాగే బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది తమన్నా. ప్రస్తుతం ఈ భామ జోరు తగ్గిందనే చెప్పాలి.
ప్రస్తుతం యాక్టర్ సత్యదేవ్ హీరోగా 'గుర్తుందా శీతాకాలం' అనే సినిమాలో నటిస్తుంది.
తాజాగా ఈ భామ మళ్లీ బిజీగా మారింది. హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్లు కూడా చేస్తోంది.
తెలుగులోకాకున్నా ఇతరభాషల్లో మాత్రం ఆఫర్లు గట్టిగానే అందుకుంటుందో తమన్నా. ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్ లు చేస్తోంది తమన్నా. అలాగే బాలీవుడ్ లో రెండు సినిమాలు కూడా చేస్తోంది.