రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రం సాధించిన ఘనత ఎప్పటికి మరువలేనిది.
ఈ చిత్రం తెలుగు చలనచిత్ర ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది.
ఈ చిత్రంతో ప్రభాస్, రానాలకు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో కనిపించారు.
కాగా తాజాగా ఈ బ్లాక్‌బస్టర్ చిత్రంపై తమన్నా చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
‘బాహుబలి’లాంటి చిత్రాల వల్ల హీరోలకే ఎక్కువ గుర్తింపు వస్తుందన్నది నా అభిప్రాయం.
అందుకే ఈ చిత్రంతో ప్రభాస్, రానాలు గ్లోబల్ స్థాయిలో సక్సెస్ అయ్యారు.
ఇక ఈ సినిమాలో నటించిన అనుష్క, రమ్యకృష్ణలకు కూడా కొంతపేరు వచ్చినా నా పాత్ర మాత్రం అతిథి పాత్రగానే ఉండిపోయింది.
అందుకే తగిన గుర్తింపు రాలేదు. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్, రానా ఇద్దరూ ఎంతో కష్టపడ్డారు.
వాళ్లు ప్రశంసలకు అర్హులు’’ అంటూ ‘బాహుబలి’ సక్సెస్‌ను క్యాష్ చేసుకోలేకపోయినట్లు తెలిపింది తమన్నా.