శరీరం శుభ్రత, తాజాదనాన్ని పొందడానికి స్నానం చేయడం చాలా ముఖ్యం

కొందరు బకెట్‌లో నీళ్లు నింపుకుని స్నానం చేస్తారు. మరి కొందరు షవర్‌ కింద స్నానం చేస్తారు

స్నానం చేసే నీటిలో కొన్ని వస్తువులను కలపడం వల్ల రోజంతా హుషారుగా వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు

స్నానం చేసే నీటిలో నిమ్మరసం పిండాలి. ఇది చెమట వల్ల వచ్చే దుర్వాసన, బ్యాక్టీరియాను చంపుతుంది

గ్రీన్ టీని నీళ్లలో కలుపుకుని స్నానం చేస్తే చెమట వాసన పోతుంది

మీరు బకెట్ లేదా టబ్‌లో పటికను కలిపి స్నానం చేస్తే శరీర రక్త ప్రసరణ బాగా జరుగుతుంది

స్నానం చేసే నీటిని గోరువెచ్చగా చేసి అందులో రాళ్ల ఉప్పు కలపాలి. ఇలా చేయడం వల్ల దుర్వాసన పోతుంది

స్నానం చేసే ముందు వేప ఆకులను నీళ్లలో మరిగించి ఆ నీటిని వడపోసి స్నానం చేసే నీటిలో కలిపితే ఇన్ఫెక్షన్, దురద, మురికి తొలగిపోతాయి