ఇక వివరాల్లోకి వెళ్తే.. ముంబయికి చెందిన తాప్సీ, మంచు మనోజ్ ‘ఝుమ్మంది నాదం’తో హీరోయిన్ గా మారింది
ఆ తర్వాత టాలీవుడ్ లో ప్రభాస్, రవితేజ, వెంకటేష్, గోపీచంద్ లాంటి హీరోలతో కలిసి వర్క్ చేసింది.
తెలుగులో ఎక్కువగా గ్లామరస్ రోల్స్ చేసిన ఈమె.. హిందీలో మాత్రం యమ క్రేజ్ తెచ్చుకుంది.
లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూ ఉంది.
‘హీరోయిన్ గా ఉండటం కోసం చాలా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాను. ఒక్కో సినిమా కోసం ఒక్కోలా మారాల్సి ఉంటుంది.
శరీరం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారిపోతూ ఉంటుంది. అందుకే బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు డైటీషియన్ ని పెట్టుకున్నాను.
ప్రతినెలా దాదాపు డైటీషియన్ కోసం లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నాను. అని తాప్సీ చెప్పుకొచ్చింది.