ఎవరు ఎన్ని చెప్పినా సినీ ఇండస్ట్రీ మేల్‌ డామినేటెడ్ ఫీల్డే అంటున్నారు నటి తాప్సీ.

లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సత్తా చాటుతున్న ఈ బ్యూటీ.

ఇప్పటికీ తమను చిన్న చూపు చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తాజాగా హీరోల గురించి తాప్సీ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్నాయి.

 హీరోయిన్‌గా పుష్కరకాలం పూర్తి చేసుకున్న తాప్సీ, ఇప్పటికీ తన కెరీర్‌ విషయంలో సంతృప్తిగా లేనని చెబుతున్నారు.

ఈ సందర్భంగా కెరీర్‌ స్టార్టింగ్‌లో తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకొని ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పట్లో హీరోయిన్‌కు ఇచ్చే కేరవాన్‌లు అగ్గిపెట్టేలా ఉండేవన్న తాప్సీ..

 హీరోలకు మాత్రం డబుల్‌ డోర్‌ వ్యాన్‌లను ఎరేంజ్‌ చేసేవారని చెప్పారు.