టీ20 ప్రపంచ కప్‌లో గందరగోళం..ఒకేరోజు నలుగురు ప్లేయర్స్ ఔట్..

T20 ప్రపంచ కప్ 2022 ఆస్ట్రేలియాలో ప్రారంభమైంది. మొదటి రౌండ్‌లోని కొన్ని మ్యాచ్‌లు కూడా జరిగాయి.

సూపర్-12 రౌండ్‌లో ఆడే జట్ల వార్మప్ మ్యాచ్‌లు కూడా పూర్తయ్యాయి.

అయితే, ఆటగాళ్లకు గాయాలయ్యే ప్రక్రియ మాత్రం ఆగడం లేదు.

ప్రపంచ కప్ ప్రారంభానికి ముందే కీలక ఆటగాళ్లు ఔట్ అయ్యారు.

అక్టోబర్ 19 బుధవారం 3 జట్ల నుంచి 4గురి ఆటగాళ్ల ప్రయాణం ముగిసింది.

శ్రీలంకకు ఒకేసారి రెండు భారీ షాక్‌లు తగిలాయి. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ దుష్మంత చమీరా మరోసారి గాయపడ్డాడు. అతని స్థానంలో కసున్ రజితను చేర్చారు.

దనుష్క గుణతిలక గాయం శ్రీలంక జట్టుకు సమస్యలను జోడించింది. అతని స్థానంలో రిజర్వ్ ఆటగాడు అషెన్ బండారను చేర్చారు.

ఇంగ్లండ్‌ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టోప్లీ పాకిస్థాన్‌తో వార్మప్ మ్యాచ్‌కు ముందు గాయపడ్డాడు. అతని స్థానంలో ఎడమచేతి వాటం పేసర్ టిమల్ మిల్స్ దక్కించుకున్నాడు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టు ఆల్-రౌండర్ జావర్ ఫరీద్ కాలులో ఫ్రాక్చర్‌తో దూరమయ్యాడు. ఆ స్థానంలో ఫహద్ నవాజ్ చేరాడు.