IND vs PAK: హార్దిక్ ఖాతాలో భారీ రికార్డ్.. తొలి భారత బౌలర్‌గా సరికొత్త చరిత్ర..

మెల్‌బోర్న్‌లో పాకిస్తాన్‌ను ఓడించి భారత్ విజయఢంకా మోగిచింది.

పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

భారత్‌ తరపున అర్ష్‌దీప్‌ సింగ్‌, హార్దిక్‌ పాండ్యా తలో 3 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన పేరిట ఓ భారీ రికార్డు సృష్టించాడు.

హార్దిక్ పాండ్యా పాకిస్తాన్‌తో జరిగిన అంతర్జాతీయ T20 మ్యాచ్‌లలో మూడుసార్లు ఇన్నింగ్స్‌లో 3 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఘనతను సాధించాడు.

ఈ విషయంలో శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ, ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ టైలను హార్దిక్ పాండ్యా సమం చేశాడు.

అంతకుముందు శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ, ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ టై ఈ ఘనత సాధించారు.

ఈ జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన టిమ్ సౌథీ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అతను 4 సార్లు ఈ ఘనత సాధించాడు.

హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 30 పరుగులకే ముగ్గురు ఆటగాళ్లను ఔట్ చేశాడు.