టీ20 ప్రపంచ కప్ 2022లో తొలి సెంచరీ నమోదు.. ఇప్పటివరకు శతకాలు చేసింది వీరే..

దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ రిలే రస్సో టీ20 ప్రపంచకప్‌లో తొలి సెంచరీ సాధించాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-12 గ్రూప్-1 మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాఫ్రికా ఆటగాడిగా నిలిచాడు.

రూసో 56 బంతుల్లో 109 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు.

ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇది 10వ సెంచరీ మాత్రమే.

ఇప్పటి వరకు 9 మంది బ్యాట్స్‌మెన్‌లు ఈ 10 సెంచరీలు సాధించారు.

ఇందులో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ పేరిట రెండు సెంచరీలు ఉన్నాయి.

టీ20 ప్రపంచ కప్ టోర్నీలో సెంచరీలు చేసిన ఇతర బ్యాటర్లు వీరే..

సురేశ్ రైనా (భారత్)

మహేల జయవర్ధనే (శ్రీలంక)

బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్‌)

అలెకెల్ హేల్స్ (ఇంగ్లండ్‌)

అహ్మద్ షాజాద్ (పాకిస్థాన్‌)

తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్‌)

జోస్ బట్లర్ (ఇంగ్లండ్‌)