ప్రస్తుత కాలంలో చాలామంది దంపతులు వ్యక్తిగత జీవితాన్ని ఆనందమయంగా గడపలేకపోతున్నారు.
చిన్న చిన్న కారణాలతో, మనస్పర్ధలతో దంపతులు, ప్రేమికుల మధ్య బంధం చెడిపోతోంది.
ఈ విషయాలను విస్మరిస్తే సంబంధం మరింత క్షీణిస్తుంది. ఇలాంటి సందర్భంలో కొన్ని చిట్కాలతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఒకరినొకరు కించపరుచుకోవడం మానుకోండి. కోపం అనేది సహజం.. కానీ లిమిట్స్ దాటకుండా ఒకరినొకరు అర్ధం చేసుకోండి
రిలేషన్‌షిప్‌లో తాజాదనాన్ని కోరుకోవడానికి కొన్నిసార్లు కొంచెం దూరం కూడా అవసరం. ఈ దూరం భౌగోళికంగా ఎక్కువగా ఉండకూడదు.
రాత్రి సమయంలో మొబైల్ ఫోన్ కు దూరంగా ఉండండి.. ఫోన్‌లో బిజీగా ఉండటం వల్ల రిలేషన్‌షిప్ మధ్య గ్యాప్ వచ్చే అవకాశం ఉంది.
మీ భాగస్వామితో కలిసి ప్రయాణం చేయండి.. దీనివల్ల రిలాక్స్ తోపాటు రిలేషన్ కూడా మరింత బలోపేతం అవుతుంది.
అప్పుడప్పుడు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వండి.. దీనివల్ల దంపతుల మధ్య బంధం మరింత పెరుగుతుంది.