హీరోయిన్ కాకపోయినా అంతకుమించి అన్నట్లుగా ఉంది సురేఖా వాణి డాటర్ సుప్రిత ట్రెండ్.
సినిమాలు చేసింది లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ పెంచుకుంది సుప్రిత.
సురేఖా వాణి డాటర్ గా పాపులర్ అయిన ఈ బ్యూటీ లవ్ ఎఫైర్ పై జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి.
త్వరలోనే తన పెళ్లి వార్త చెప్పబోతుందనే టాక్ నడుస్తోంది. సీక్రెట్ గా లవ్ ఎఫైర్ నడిపిస్తున్న ఆమె పెళ్లి పీటలెక్కేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు జనం.
వాలెంటైన్స్ డే సందర్భంగా స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేసిన జీ తెలుగు టీమ్.. ‘ఓ రెండు ప్రేమ మేఘాలు’ అనే షో చేశారు.
ఈ లవ్ రిలేటెడ్ షోలో యూట్యూబర్ నిఖిల్ విజయేంద్రసింహతో జంటగా హాజరైంది సుప్రిత. ఈ షోలో వారి వారి జర్నీతో పాటు పరిచయం తాలూకు కొన్ని విషయాలు రివీల్ చేశారు.
ఇదిలాఉంటే నిఖిల్ తో దిగిన కొన్ని ఫొటోస్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ దీనికి లవ్ సింబల్ జోడించింది సుప్రిత.
దీంతో ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని అంతా ఫిక్సయ్యారు. ఇక పెళ్ళెప్పుడు మేడం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.